HNK: భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్ర స్వామి వారి ఆలయంలో శుక్లాష్టమి సందర్భంగా నేడు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం అధిక సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శించి తమ మొక్కలను చెల్లించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు, అర్చకులు అన్ని ఏర్పాట్లు చేసి ఆశీర్వచనాలు అందజేశారు.