క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పుట్టిన రోజు సందర్భంగా బీసీసీఐ స్పెషల్ విషెస్ తెలిపింది. 664అంతర్జాతీయ మ్యాచ్‌లు, 34,357 పరుగులు, 100 సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్ అని పేర్కొంది. టీమిండియా ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్ 2011 విజయ యాత్రలో సభ్యుడు, దిగ్గజ సచిన్ టెండూల్కర్‌కు శుభాకాంక్షలు అని ‘X’ వేదికగా రాసుకొచ్చింది.