AP: అమ్మ, అమరావతి, ఆంధ్రప్రదేశ్ ఇష్టం లేనివారిని పట్టించుకోమని మంత్రి సంధ్యారాణి అన్నారు. జగన్ రాజకీయం చేయాలనుకుంటే.. ముందు ఇంటిని చక్కబెట్టుకోవాలని సూచించారు. సొంత చెల్లి బయటపెడుతున్న విషయాలకు ధైర్యం ఉంటే సమాధానం చెప్పాలన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్దిని చూసి YCP ఓర్వలేకపోతుందని విమర్శించారు. ఒక్క అవకాశం ఇస్తే కబ్జా చేసి.. ఎవరూ బతకలేకుండా ఆస్తులు లాక్కున్నారని ఆరోపించారు.