WGL: నర్సంపేట పట్టణంలో ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ న్యాయం కోసం పోరాడుతూ మృతి చెందడం బాధాకరమని బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు. ఇది ఆత్మహత్య కాదని,ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన హత్యేనని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా మోసం చేసిందని, డిమాండ్లను సానుకూలంగా పరిశీలించలేదు విమర్శించారు.