GNTR: అమరావతిలోని బిట్స్ పిలానీ క్యాంపస్ సరికొత్త ఆకృతిలో రూపుదిద్దుకోనుంది. ప్రపంచంలోనే తొలిసారిగా ఈ విద్యా సంస్థ భవనాన్ని ‘డీఎన్ఏ’ ఆకారంలో నిర్మించనున్నారు. నూతన ఆవిష్కరణలు, విజ్ఞాన పరిణామానికి ప్రతీకగా దీనిని డిజైన్ చేస్తున్నారు. ఈ నిర్మాణంతో అమరావతి భవిష్యత్తులో అత్యుత్తమ విద్య, అధునాతన పరిశోధనలకు కేంద్రంగా మారుతుందని అంచనా వేస్తున్నారు.