BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామిని కుటుంబ సమేతంగా హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఇవాళ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆలయ అర్చకులు ఆలయ సంప్రదాయ స్వాగతం పలికారు. వేద పండితులు వేదాశీర్వచనాలు చేసి స్వామివారి చిత్రపటం, లడ్డు ప్రసాదం అందించారు.