JN: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని జనగామ అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ అధికారులను ఆదేశించారు. ఇవాళ బచ్చన్నపేట,తమ్మడపల్లి కేంద్రాలను సందర్శించి గన్నీ బ్యాగుల లభ్యత, రికార్డులను పరిశీలించారు. కొనుగోళ్లు త్వరగా పూర్తి చేసి, ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.