BHNG: కార్మికుల ప్రాణత్యాగాలతో సాధించుకున్న హక్కులను కాపాడుకోవాలంటే ‘మేడే’ వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని, సీఐటీయు జిల్లా కార్యదర్శి కల్లూరు మల్లేశం కార్మికులకు పిలుపునిచ్చారు. బుధవారం ఆలేరు మండల కేంద్రంలో సీఐటీయు మండల జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మల్లేశం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.