ATP: శింగనమల నియోజకవర్గంలోని YCP కుటుంబాలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ భరోసా ఇచ్చారు. గార్లదిన్నె మండలం కల్లూరులో ఆత్మహత్య చేసుకున్న గాంధీ కుమార్తె కుటుంబాన్ని, అనారోగ్యంతో మృతి చెందిన జలాలపురం మాజీ ఎంపీటీసీ రామచంద్ర కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. బాధిత సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.