WGL: నర్సంపేటలో మంగళవారం కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరిని నిరసిస్తూ మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆమె పోస్ట్ కార్డులపై సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఆమె మాట్లాడుతూ.. మహిళలకు చట్టసభలో సముచిత ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.