W.G: పెనుమంట్ర -2 సచివాలయం పరిధిలో ANM లక్ష్మి, ఆశా సిబ్బంది ఆధ్వర్యంలో ఎన్సీడీ (NCD) సర్వే జరిగింది. ప్రజలకు ఆరోగ్య పరీక్షలు చేసి సీజనల్ వ్యాధులు, పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఎలాంటి అనారోగ్య లక్షణాలు ఉన్నా వెంటనే తెలియజేయాలని, ప్రజలు ఆరోగ్య విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.