NGKL: గ్రామీణ ప్రాంతాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని కొత్త బ్రాహ్మణపల్లి, పాత బ్రాహ్మణపల్లి గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని అన్నారు.