NZB: జిల్లా కమిషనరేట్ పరిధిలో అనుమతి లేకుండా విగ్రహాల ఏర్పాటు చేయడం నిషేధమని, అలాగే పెద్ద శబ్ధంతో డీజేలు పెట్టడాన్ని అనుమతించేది లేదని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. బుధవారం ప్రకటన విడుదల చేశారు. ఎక్కువ శబ్దంతో డీజేలను ఏర్పాటు చేయరాదని, ఇలా చేయడం వల్ల దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడే వృద్ధులు,చిన్న పిల్లలు, మహిళలు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.