TG: పరిగి ప్రాంతంలో పరిశ్రమల పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారని ఆరోపిస్తూ.. జాగృతి అధ్యక్షురాలు కవిత రైతులతో కలిసి ప్రత్యక్ష పోరాటానికి దిగారు. వికారాబాద్ ఆర్డీవో కార్యాలయం వద్ద భారీ ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం పారిశ్రామికీకరణ ముసుగులో అన్నదాతల పొట్ట కొడుతోందని మండిపడ్డారు. పరిగిలో సారవంతమైన సాగు భూములను పరిశ్రమల కోసం సేకరించడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు.