MLG: సెన్సస్-2027 ఫేజ్-1 ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని తెలంగాణ జనగణన కార్యకలాపాల సంచాలకులు భారతి హోలీకేరి సూచించారు. గురువారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ములుగు నుంచి జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు పాల్గొన్నారు. జనగణన పనులను వేగవంతంగా, ఖచ్చితంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.