BDK: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు గురువారం పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల నాగారం వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టును తనిఖీ చేశారు. బక్రీద్ పండుగ దృష్ట్యా పశువుల అక్రమ రవాణాను అరికట్టడానికి, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. పశువుల అక్రమ రవాణా తనిఖీల్లో నిర్లక్ష్యం వద్దన్నారు.