MHBD: డోర్నకల్ రైల్వే స్టేషన్ పరిధిలో ఈనెల 23 నుండి 25 వరకు, అలాగే 30 నుండి జూన్ 1వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాజీపేట–డోర్నకల్, డోర్నకల్–కాజీపేట పుష్పుల్ సర్వీసులతో పాటు భద్రాచలం రోడ్–బల్లర్షా సింగరేణి ఎక్స్ప్రెస్ రద్దు చేశారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి రైల్వే శాఖకు సహకరించాలని అధికారులు కోరారు.