BHPL: మహదేవపూర్(M) కాళేశ్వరంలో సరస్వతి నది అంత్య పుష్కరాల సందర్భంగా రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా దంపతులు పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కంచి పీఠాధిపతిని కలిసి ఆశీర్వాదం పొందారు. ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల, దేవాదాయ శాఖ సెక్రటరీ శైలజ, కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు.