ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసింది. ప్లేఆఫ్స్ చేరాల్సిన కీలక మ్యాచ్లో గుజరాత్ చేతిలో 89 పరుగుల తేడాతో CSK ఘోర పరాజయం పాలైంది. 230 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో GT బౌలర్లు సిరాజ్, రషీద్ తలో 3 వికెట్లతో చెన్నైని కోలుకోలేని దెబ్బతీశారు. దూబే(47) ఒంటరి పోరాటం చేసినా.. CSK 140 పరుగులకే ఆలౌటై టోర్నీ నుంచి వెనుదిరిగింది.