AP: SIPB ఆమోదం పొందిన ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో గత 23 నెలల్లో రూ.21.64 లక్షల కోట్ల పెట్టుబడులతో 756 ప్రాజెక్టులు వచ్చాయని, వీటి ద్వారా యువతకు 21.20 లక్షలకు పైగా ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించారు. ఈ సెప్టెంబర్ నాటికి పనుల గ్రౌండింగ్ పూర్తి చేసి, 2028 చివరినాటికి ప్రాజెక్టులను ప్రారంభించాలని అధికారులకు సీఎం ఆదేశించారు.