పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకుండా ప్రధాని మోదీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఒకవైపు ఇంధన ధరలను నియంత్రించడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వం.. మరోవైపు ప్రజలను మాత్రం ఇంధన పొదుపు పాటించాలని సూచనలు చేయడం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు. ధరల భారంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోవడం లేదని కేంద్రంపై సీఎం మండిపడ్డారు.