JGL: మల్యాల మండలం తాటిపల్లి గురుకుల కళాశాలకు చెందిన ఇంటర్ విద్యార్థులను కలెక్టర్ సత్యప్రసాద్ సోమవారం అభినందించారు. ఇంటర్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ఆయన ప్రశంసించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మానస, లెక్చరర్లు పాల్గొన్నారు.