HYD: మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు శ్రీనివాసులుకు నాంపల్లి కోర్టు జీవితఖైదు విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. 2024లో SR నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి అనిత, నిందితుడికి జీవితాంతం జైలు శిక్షతో పాటు, బాధితురాలికి రూ. 10 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించారు.