BDK: కొత్తగూడెం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల వినతులను కలెక్టర్ అంకిత్ స్వీకరించి తక్షణ పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి గడువులోగా సమస్యలు పరిష్కరించాలని సూచించారు. మండలాల వారీగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అంశాలను పరిశీలించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆలస్యం సహించబోమని హెచ్చరించారు.