MDCL: బహదూర్ పల్లి గ్రీన్ హిల్స్ కాలనీలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో అగ్నికి ఆహుతైన గోదాం సంఘటన స్థలాన్ని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పరిశీలించారు. ఈ సందర్భంగా బాధితులు ప్రమాద తీరును వారికి వివరించి కన్నీటి పర్యంతమయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గోదాం కాలిన సంఘటనలో బాధితులకు సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామన్నారు.