తన కెరీర్లో ప్రస్తుతం వైవిధ్యమైన పాత్రలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు హీరోయిన్ తమన్నా వెల్లడించింది. మహిళా ప్రాధాన్య చిత్రాలు, ఓటీటీ కంటెంట్, స్పెషల్ సాంగ్స్ ఇలా అన్ని రకాలుగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపింది. తాను నటించిన చిత్రాలన్నీ వరుసగా విడుదల కాబోతున్నాయని, ఈ కొత్త ప్రయాణం తనలో మరింత ఉత్సాహాన్ని కలిగిస్తోందని మిల్కీ బ్యూటీ చెప్పుకొచ్చింది.