TG: ఈ నెల 20న జగిత్యాలలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు భారీ బహిరంగ సభ కోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇన్చార్జీలను ప్రకటించారు. ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ, సభ విజయవంతం కోసం సీనియర్ నాయకులకు బాధ్యతలు అప్పగించింది.