NRML: జిల్లాలో చేపల పెంపకం పెరుగుతున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని మత్స్యశాఖ సూచించింది. చెరువుల నీటి నాణ్యత, ఆమ్లజని స్థాయిని క్రమం తప్పకుండా పరిశీలించాలి. అధిక ఆహారం వేయడం వల్ల నీరు కలుషితం కావచ్చని హెచ్చరించారు. మంచి నాణ్యత గల చేప పిల్లలను ఎంచుకోవడం, వ్యాధుల లక్షణాలు కనిపిస్తే వెంటనే చర్యలు తీసుకోవడం అవసరమని తెలిపారు.