యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ భారత సీనియర్ జట్టుకు ఎంపిక కావడానికి ఎంతో సమయం పట్టేలా లేదు. U-19 మొదలుకుని ఇండియా-Aతో పాటు IPLలో కూడా వైభవ్ దుమ్మురేపుతున్నాడు. కేవలం ఏదో ఒక మ్యాచ్‌కే పరిమితం కాకుండా, నిలకడగా ఆడుతూ వేగంగా పరుగులు సాధిస్తున్నాడు. ఈ క్రమంలో, వరుసగా విఫలమవుతున్న అభిషేక్ శర్మ స్థానంలో వైభవ్‌ను జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు బలంగా వ్యక్తమవుతున్నాయి.