JNG: పాలకుర్తి వాస్తవ్యులు తక్కలపల్లి వెంకటేశ్వరరావు కూతురు వివాహం ఈరోజు ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో కొనసాగాలని అక్షింతలు వేసి, శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, స్థానికులు ఉన్నారు.