అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘డెకాయిట్’ మూవీ ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ఈ మూవీ రెండు రోజుల కలెక్షన్స్‌పై అప్డేట్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో రూ.28 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక దర్శకుడు షానీల్ డియో తెరకెక్కించిన ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించాడు.