MDK: రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామానికి చెందిన బోడ్డు సుష్మిత ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 1000కి 973 మార్కులతో రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించింది. చిట్కుల్ TGSWRS COE ప్రభుత్వ కళాశాలలో చదువుతూ అసాధారణ ప్రతిభ చూపిన సుష్మితను గ్రామస్తులు ఘనంగా అభినందించారు. ప్రభుత్వ విద్యార్థినిగా ఆమె సాధించిన విజయం గ్రామానికి గర్వకారణమని, అందరికీ ఆదర్శమని కొనియాడారు.