లెజెండరీ సింగర్ ఆశా భోస్లే కన్నుమూశారు. నిన్న గుండెపోటుతో ముంబైలో ఆసుపత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. భారతీయ చలనచిత్ర సంగీతంలో అత్యధిక పాటలు పాడిన గాయనిగా ఆమె గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్నారు. ఆమె మృతితో సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. భోస్లే మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.