MDK: వెల్దుర్తి మండలంలో విషాదం నెలకొంది. తాజాగా విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఫెయిల్ కావడంతో మంగళపర్తికి చెందిన చాకలి సాయిరాం మనస్థాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు.