SDPT: హుస్నాబాద్ జిల్లెలగడ్డ వద్ద నిర్మాణంలో ఉన్న అర్బన్ ఫారెస్ట్ పార్క్ పనులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఇవాళ పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనులపై అటవీశాఖ అధికారులు వివరాలు అందించారు. ఇప్పటికే మట్టి ట్రాక్, వాటర్ సంపులు పనులు పూర్తయ్యాయని తెలిపారు. పిల్లల కోసం ఆకర్షణీయమైన క్రీడా సామాగ్రితో చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు.