MDK: ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో సౌకర్యాల కోసం విద్యార్థినుల నిరసనపై ఎమ్మెల్యే రోహిత్ రావు స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు ఛైర్ పర్సన్ కానుగు రాధికా కళాశాలను సందర్శించి విద్యార్థినులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. తక్షణం కనీస సౌకర్యాలు కల్పించి, అన్ని సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.