జూ.ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న మూవీ ‘డ్రాగన్’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ నటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయనతో మేకర్స్ చర్చలు జరుపుతున్నారట. అంతేకాదు మే 20న తారక్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ కానున్నట్లు సమాచారం.