TG: ఇంటర్ ఫలితాల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు కేంద్రమంత్రి బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పరీక్షల్లో ఆశించిన మార్కులు రాని, విఫలమైన విద్యార్థులకు భరోసా ఇచ్చారు. ‘ఇది కేవలం మీ ప్రయాణంలో ఒక మైలురాయి మాత్రమే. మీ అంతిమ గమ్యం కాదు. మీ భవిష్యత్తు ఈ ఒక్క ఫలితంపై ఆధారపడి ఉండదు. మీరు తర్వాత ఏం చేస్తారు? అనే దానిపైనే మీ విజయం ఆధారపడి ఉంటుంది’ అని ట్వీట్ చేశారు.