ADB: ఉట్నూర్ మండలంలోని దంతనపల్లి నుంచి బీర్సాయిపేట్ గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గం పూర్తిగా అధ్వానంగా మారింది. రెండు కిలోమీటర్ల మేర రోడ్డు మార్గం పూర్తిగా గుంతలమయం కావడంతో రాత్రి వేళలో ప్రయాణం ప్రమాదకరంగా మారిందని వాహనదారులు వాపోయారు. అధికారులు, నాయకులు స్పందించి రోడ్డు మార్గాన్ని బాగు చేయాలని కోరుతున్నారు.