AP: నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఈనెల 15న సందర్శించనున్నారు. మత్స్యకారులకు జరుగుతున్న అన్యాయాలపై జగన్ ప్రశ్నించనున్నారు. ఈ కార్యక్రమానికి 164 గ్రామాల మత్సకారులు రానున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.