JN: రఘునాథపల్లి మండలం కంచనపల్లిలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మక్కల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. రైతులు 14% తేమలోపు మక్కలను తీసుకురావాలని సూచించారు. నియోజకవర్గంలో 6 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతుల నష్టాలను నివారించేందుకు ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తోందన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు.