అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల కోసం నిర్వహించే NTPC పరీక్ష తాత్కాలిక షెడ్యూల్ను RRB విడుదల చేసింది. ఈ పరీక్షలను మూడు దశల్లో నిర్వహించనున్నారు. మొదటి విడతలో మే 7, 8, 9 తేదీల్లో, రెండో విడతలో జూన్ 13, 14న.. మూడో విడతలో జూన్ 16 నుంచి జూన్ 21 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీని పరీక్షకు 10 రోజుల ముందు అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.