ADB: ఉట్నూర్ మండలం హర్కాపూర్ గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హర్కాపూర్ గ్రామ సమీపంలో మంగళవారం సాయంత్రం ఓ బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో 108లో ఆసుపత్రికి తరలించారు.