TG: జోగులాంబ గద్వాల జిల్లా జూరాల ప్రాజెక్టుకు స్వల్ప వరద వస్తోంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలకు కృష్ణా నదికి వరద కొనసాగుతోంది. జలాశయం ఇన్ ఫ్లో 7,376 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 1,195 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లుగా ఉండగా.. ప్రస్తుత నీటిమట్టం 316.380 మీటర్లు ఉంది.