జగిత్యాలలోని 42వ వార్డులో మున్సిపల్ పార్క్ వద్ద నాణ్యతలేని బీటీ రోడ్డు వేసినందుకు నిరసనగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ నాగరాజు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల శ్రీనివాస్‌తో పాటు శ్రీనివాస్, మానస, జ్ఞానేశ్వర్, లత, శ్రీనివాస్ పాల్గొన్నారు.