AP: కడప జిల్లా ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. మహిళలు, బాలికలపై దాడులకు తెగబడితే కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఇలాంటి విషయాల్లో నిందితులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించరాదని తెలిపారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. కాగా, ఖాజీపేటలో నిన్న ప్రేమాన్మాది వెంకటేష్ బాలికను గొంతుకోసి చంపిన విషయం తెలిసిందే.