JGL: ఇబ్రహీంపట్నంకు చెందిన సాయి గంజాయి మత్తుకు బానిస కావడంతో అతడిని డి అడిక్షన్ సెంటర్కు తరలించినట్టు ఎస్సై నవీన్ కుమార్ తెలిపారు. సాయి పై ఓ కేసు నమోదు కాగా గాలించి పట్టుకున్నామని, మత్తులో ఉన్న అతనికి టెస్ట్ చేయగా.. గంజాయి సేవించినట్లు నిర్ధారణ అయిందన్నారు. దీంతో అతనిపై కేసు నమోదు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచామన్నారు.