KNR: సైదాపూర్ మండలంలోని తెలంగాణ మోడల్ స్కూల్ 2026-27 విద్యా సంవత్సరానికి ఆరవ తరగతి, ఏడవ తరగతి ప్రవేశాలకు ఈనెల 19న రాత పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ సంపత్ కుమార్ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 6వ తరగతికి, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏడవ తరగతి విద్యార్థులకు రాత పరీక్ష నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.