VKB: వికారాబాద్ జిల్లాలో ఈనెల 13 నుంచి 18 వరకు ‘అరైవ్-అలైవ్’ రోడ్డు సేఫ్టీ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్ దీపక్ తివారి సూచించారు. గ్రామ సభలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించి హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగంపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. మైనర్ల డ్రైవింగ్ నియంత్రించాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.