AP: కడప జిల్లా ఖాజీపేటలో బాలికను గొంతు కోసి చంపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కడప ఎస్పీ విశ్వనాథ్‌ను మృతిచెందిన బాలిక తల్లిదండ్రులు కలిశారు. తమకు న్యాయం చేయాలని వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా దోషిని కఠినంగా శిక్షిస్తామని.. న్యాయం చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు.